జీ సినిమాలు (30th ఆగష్టు)

Tuesday,August 29,2017 - 10:08 by Z_CLU

పవిత్ర ప్రేమ

హీరో  హీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, జూన్ 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

==============================================================================

వియ్యాల వారి కయ్యాలు

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

మడత కాజా

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

చక్రం

నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు

రిలీజ్ డేట్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

=============================================================================

మైసమ్మ IPS

నటీనటులు  : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే

ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు

రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను  పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు. ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది.  మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

యాక్షన్ 3D

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.