జీ సినిమాలు ( 2nd సెప్టెంబర్ )

Saturday,September 01,2018 - 11:02 by Z_CLU

ఆనందో బ్రహ్మ

నటీనటులు : తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్

ఇతర నటీనటులు : షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్

మ్యూజిక్ డైరెక్టర్ : K .

డైరెక్టర్ : మహి V . రాఘవ్

ప్రొడ్యూసర్ : విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి

రిలీజ్ డేట్ : 10  ఆగష్టు 2017

ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఇంటిని రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని నలుగురు విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

==============================================================================

శివలింగ

నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీసీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

అన్నవరం

నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

యుగానికి ఒక్కడు

నటీనటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.