జీ సినిమాలు ( మే 2nd)

Monday,May 01,2017 - 10:06 by Z_CLU

హీరోహీరోయిన్లు – సురేష్, మాలాశ్రీ

నటీనటులు – సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ

సంగీత దర్శకుడు –  రాజ్ కోటి

నిర్మాత –  డాక్టర్ డి.రామానాయుడు

దర్శకుడు – బోయిన సుబ్బారావు

విడుదల తేదీ – 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

==============================================================================

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్

ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామానాయుడు

దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

అప్పటి వరకు  ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమలో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథతో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు.

==============================================================================

నటీ నటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీ నటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ : మారుతిప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలైట్స్.

=============================================================================

నటీ నటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

=============================================================================

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ

ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981

టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.

==============================================================================

హీరోహీరోయిన్లు – నారా రోహిత్ ,వేదిక

నటీనటులు      – రాజీవ్ కనకాల, సాయాజీ షిండే తదితరులు

సంగీతం      –  మణిశర్మ

దర్శకత్వం  –  చైతన్య దంతులూరి

విడుదల తేదీ – 2009

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బాణం’. తొలి సినిమా అయినప్పటికీ కథానాయకుడిగా నారా రోహిత్ తన దైన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన వేదిక కథానాయికగా నటించింది. సందేశం తో కూడిన ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్- వేదిక జంట అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సీరియస్ యాక్టింగ్ తో పాటు మణి శర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్. దర్శకుడి చైతన్య స్క్రీన్ ప్లే, మాటలు అందరినీ ఆకట్టుకొని పాత్ బ్రేకింగ్ హానెస్ట్ మూవీ గా నిలిచిపోయింది.