జీ సినిమాలు ( 2nd జూన్ )

Saturday,June 02,2018 - 12:23 by Z_CLU

పోరు తెలంగాణ

నటీనటులు : R. నారాయణ మూర్తి

డైరెక్టర్ : R. నారాయణ మూర్తి

నిర్మాత : R. నారాయణ మూర్తి

విప్లవ సినిమాల డైరెక్టర్ R. నారాయణ మూర్తి నిర్మించిన సినిమా ‘పోరు తెలంగాణ’. రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలే కథాంశంగా తెరకెక్కిన ‘పోరు
తెలంగాణ’ అన్ని సెంటర్ లలోను అద్భుతంగా అలరించింది.

=============================================================================

సుడిగాడు

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=============================================================================

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్

ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================

లక్కున్నోడు

నటీనటులు : మంచు విష్ణు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, సత్య రాజేష్

మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు, ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే అన్ లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం..

=============================================================================

యమన్

నటీనటులు : విజయ్ ఆంటోని, మియా జార్జ్

ఇతర నటీనటులు : త్యాగరాజన్, ఆరుళ్ డి. శంకర్, సంగిలి మురుగన్, చార్లీ, G. మరిముత్తు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : A. శుభాస్కరణ్

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

ఓ యాక్సిడెంట్ కేసును తనపై వేసుకొని జైలుకి వెళ్లి దేనికైనా తెగించే వ్యక్తిగా మారిన అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోనీ) కొందరు రాజకీయ నాయకుల అండదండలతో జైలు నుంచి బయటికొస్తాడు. అలా జైలు నుంచి బయటికి వచ్చిన అశోక్ గతంలో తన తండ్రి దేవరకొండ గాంధీ(విజయ్ ఆంటోనీ)ని చంపిన సాంబ, నరసింహ వంటి రౌడీలతో పాటు ఎం.ఎల్.ఏ పాండుని రాజీకీయంగా ఎలా దెబ్బ కొట్టి అంతం చేశాడు… చివరికి తన తండ్రి కలగా మిగిలిన ఎం.ఎల్.ఏ పదవిని ఎలా సొంతం చేసుకొని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు…అనేది సినిమా కథాంశం…

============================================================================

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్

ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్

రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.