జీ సినిమాలు ( 2nd జూలై )

Monday,July 01,2019 - 10:02 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణహర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబుసంజన గల్రానినిఖిత తుక్రాల్రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2.  సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుందిహీరోయిన్ పూర్ణ నటన  సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

రంగుల రాట్నం
నటీనటులు : రాజ్ తరుణ్శుక్లా
ఇతర నటీనటులు : సితారప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

==============================================================================

శ్రీమంతుడు
నటీనటులు : మహేష్ బాబుశృతి హాసన్
ఇతర నటీనటులు రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

ముత్తు

నటీనటులు : రజినీకాంత్, మీనా

ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

బలుపు
నటీ నటులు : రవితేజశృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్  : 28 జూన్ 2013
రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

=============================================================================

చింతకాయల రవి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్వేణు తొట్టెంపూడిశయాజీ షిండేచంద్ర మోహన్బ్రహ్మానందంసునీల్ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008
చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.