‘జీ సినిమాలు’ 2 వ వార్షికోత్సవం స్పెషల్

Monday,September 03,2018 - 07:19 by Z_CLU

జీ సినిమాలు లాంచ్ అయి రేపటికి సరిగ్గా రెండేళ్ళు. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘సుప్రీమ్’ రేపు టెలీకాస్ట్ కానుంది. సాయి ధరమ్ తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ‘జీ సినిమాలు’ చానల్ లో రేపు సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుంది.

కామెడీ, యాక్షన్, ఇమోషన్, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా సుప్రీమ్. సినిమాలో ఎన్ని కమర్షియల్స్ ఎలిమెంట్స్ ఉన్న, సినిమా సక్సెస్ కి బిగ్గెస్ట్ రీజన్ కథే. ఆ కథ చుట్టూ తిరిగే ప్రతి ఎలిమెంట్ ని దర్శకుడు అనిల్ రావిపూడి స్ట్రేట్ టు హార్ట్ ఫార్మాట్ లో ఆడియెన్స్ ని మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే స్టైలిష్ ట్యాక్సీ డ్రైవర్ గా ఫుల్ టూ మెస్మరైజ్ చేసేశాడు. అటు కామెడీ టైమింగ్ నుండి ఇటు రాజన్ కాంబినేషన్ లో ఉండే ఇమోషనల్ సీన్స్, అవి లీడ్ చేసే యాక్షన్ సీన్స్ వరకు ప్రతి ఒక్కరు తేజ్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వాల్సిందే. అంత మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేశాడు తేజ్ ఈ సినిమాలో.

ఈ సినిమా రిలీజ్ అయిన తరవాత చాలా రోజుల వరకు రాశిఖన్నాని సోషల్ మీడియాలో  ‘బెల్లం శ్రీదేవి’ అనే పిలిచారంటే రాశిఖన్నా క్యారెక్టర్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నోసెంట్ పోలీసాఫీసర్ లా రాశి ఖన్నా కామెడీకి నవ్వని ఆడియెన్స్ అంటూ ఉండరు.

సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా స్టాండర్డ్స్ ని పెంచేసిన కీ ఎలిమెంట్ సాంగ్స్. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్, ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ లిస్టు లో ఉంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ సాంగ్ ‘అందం హిందోళం’ రీమిక్స్ విజువల్స్ ఎన్ని సార్లు చూసినా మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది.

ఇక సినిమాలో పృథ్వీ, ప్రభాస్ శ్రీను ‘జింగ్ జింగ్ – అమేజింగ్’ అంటూ నవ్వించడం గురించి స్పెషల్ గా మెన్షన్  చేసుకోవాలి. ఈ సినిమా సక్సెస్ తరవాత చాలా సినిమాల్లో ఈ ఫార్మాట్ లోనే కామెడీ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. అంతలా ఈ కామెడీ కాంబో సినిమా సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే సుప్రీమ్ లో ప్రతీది ఎక్స్ ట్రా ఆర్డినరీ ఎలిమెంటే. ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రేపు ‘జీ సినిమాలు’ లో చూసి ఎంజాయ్ చేయండి.