జీ సినిమాలు ( 29th సెప్టెంబర్ )

Friday,September 28,2018 - 10:06 by Z_CLU

డోర

నటీనటులు : నయనతారతంబి రామయ్య

ఇతర నటీనటులు హరీష్ ఉత్తమన్షాన్సులీల్ కుమార్బేబీ యుక్త

మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి

ప్రొడ్యూసర్ : A. సర్కునమ్హితేష్ ఝబాక్

రిలీజ్ డేట్ : 31 మార్చి 2017

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటిచివరికి ఏమైంది..ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే.

==============================================================================

గీతాంజలి

నటీనటులు : అంజలిశ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్హర్షవర్ధన్ రాణేబ్రహ్మానందంఆలీరావు రమేష్సత్యం రాజేష్శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ : కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

కృష్ణ

నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.

==============================================================================

కొత్త బంగారు లోకం 

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

హైపర్

నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా

ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

మోహిని

నటీనటులు : త్రిష, జాకీ భజ్ఞాని

ఇతర నటీనటులు : ముకేష్ తివారీ, పూర్ణిమ భాగ్యరాజ్, యోగి బాబు, జాంగిరి మధుమిత, జ్ఞానేశ్వర్, స్వామినాథన్ మరియు తదితరలు

మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్

డైరెక్టర్ : రమణ మాదేశ్

ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్

రిలీజ్ డేట్ : 27 జూలై 2018  

ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.

సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.

గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.

==============================================================================

పోలీస్ స్టోరీ-2

హీరో – సాయికుమార్

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్పీజే శర్మసనశోభరాజ్పొన్నాంబలం

సంగీతం – ఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లేదర్శకత్వం – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2నుతెరకెక్కించారుపోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా  సీక్వెల్ కు కూడాపనిచేశారుఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర  సినిమాలోనిదేయాక్షన్ సినిమాలుఅదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈసినిమా ఫుల్ మీల్స్ లాంటిది.