జీ సినిమాలు ( 29th నవంబర్ )

Wednesday,November 28,2018 - 10:07 by Z_CLU

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టిచంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్ప్రదీప్ రావత్రవి ప్రకాష్బ్రహ్మానందందివ్యవాణితెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుందినిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నటీనటులు : సుధీర్ బాబు, నందిత రాజ్

ఇతర నటీనటులు : పోసాని కృష్ణ మురళీ, సప్తగిరి, M.S. నారాయణ, ప్రగతి, చైతన్య కృష్ణ

మ్యూజిక్ డైరెక్టర్ : హరి

డైరెక్టర్ : R. చంద్రు

ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి

రిలీజ్ డేట్ : 19 జూన్ 2015

సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. టైటిల్ కి తగ్గట్టే ఈ ఇస్నిమా కృష్ణానది ఒడ్డునే సుఖాంతమవుతుంది. చినంప్పటి నుండి కలిసి పెరిగిన కృష్ణ, రాధా కాలేజ్ లోను మంచి ఫ్రెండ్స్ అవుతారు. అంతంలో కృష్ణ తన ప్రేమను రాధకు చేపాము అనుకునే లోపు అనుకోని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు.

ఆ తరవాత ఇంజినీరింగ్ చదివేటప్పుడు, ఆ తరవాత మారెంనో సందర్భాల్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ ఏదో ఒక కారణంతో తమ ప్రేమను వ్యక్తం చేసుకోకుండానే దూరమవుతుంటారు. వాళ్ళు విడిపోవడానికి గల కారణాలేంటి..? ఈ ప్రేమ జంటకు కృష్ణానదికి ఉన్న సంబంధమేంటి.. అనేది జీ సినిమాలులో చూడాల్సిందే.

==============================================================================

సౌఖ్యం

నటీనటులు : గోపీచంద్, రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, దీవన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఫ్యాఅమిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్, ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

బలుపు

నటీనటులు రవితేజశృతి హాసన్

ఇతర నటీ నటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

=============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబుసంజనాకోట శ్రీనివాస రావు, M.S. నారాయణసునీల్బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడుపూరిజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన  సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారుప్రభాస్    డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

మిస్టర్
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడుఅలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.