జీ సినిమాలు ( 29th జూలై )

Sunday,July 28,2019 - 11:01 by Z_CLU

ఆచారి అమెరికా యాత్ర

నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

==============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

=============================================================================

మిస్టర్

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్

 డైరెక్టర్శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

శివలింగ

నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

విన్నర్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

బ్రదర్స్
నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : K.V.ఆనంద్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 2012
సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.