
మాతంగి
నటీనటులు : రమ్య కృష్ణన్, జయరామ్
ఇతర నటీనటులు : ఓం పురి, శీలు అబ్రహాం, రమేష్ పిషరోది, సాజు నవోదయ, అక్షర కిషోర్, ఏంజిలిన అబ్రహాం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ
డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం
ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్, నౌషాద్ అలాతుర్
రిలీజ్ డేట్ : 20 మే 2016
సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందని…అందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో ఆత్మగా మారిన మాతంగి ఎవరు…? మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.
==============================================================================

నాగభరణం
నటీనటులు : విష్ణువర్ధన్, దిగంత్, రమ్య
ఇతర నటీనటులు : సాయి కుమార్, రాజేష్ వివేక్, దర్శన్, సాదు కోకిల, అమిత్ తివారీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : కోడి రామకృష్ణ
ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషి, సోహెల్ అన్సారి, ధవళ్ గాద
రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016
సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస… నాగ్ చరణ్ (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసింది? చివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా స్టోరీ.
==============================================================================

కుక్కలున్నాయి జాగ్రత్త
నటీనటులు : సిబిరాజ్, అరుంధతి
ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్
డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్
ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్
రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014
సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.
==============================================================================

దృష్టి
నటీనటులు : రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి
ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదిని తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : నరేష్ కుమారన్
డైరెక్టర్ : రామ్ అబ్బరాజు
ప్రొడ్యూసర్ : మోహన్
హీరో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో ఉండిపోతాడు. బేసిగ్గా ఫోటో గ్రాఫర్ అవ్వడంతో,బోర్ కొట్టినప్పుడల్లా తన కెమెరాతో అవతల పక్కన ఉన్న ఆపార్ట్ మెంట్ లో జనాల్ని గమనిస్తూ ఉంటాడు. ఒక్కోసారి తన దృష్టికి ఓ యంగ్ ప్రేమ జంట కనిపిస్తారు. మరోసారి పిల్లలు విదేశాల్లో ఉండిపోయి ఇక్కడ ఒంటరితనం అనుభవిస్తున్న వృద్ధులు కనిపిస్తారు. ఇక ఇదే వరసలో ఒక మర్డర్ కూడా చూస్తాడు. కానీ మర్డర్ వలయంలో తనే చుట్టుకుంటాడు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? అసలా మర్డర్ చేసింది ఎవరు…? అనేదే మిగతా కథాంశం.
==============================================================================

పేపర్ బాయ్
నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్
ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : V. జయశంకర్
ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018
పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
=============================================================================

అవును 2
నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే
ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015
రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
===========================================================================

తుంబా
నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్
ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి
డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.
ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019
అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
==============================================================================

బెండు అప్పారావు R.M.P.
నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ
ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009
R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.