జీ సినిమాలు ( 28th జూన్ )

Thursday,June 27,2019 - 10:02 by Z_CLU

నాగభరణం

నటీనటులు : విష్ణువర్ధన్దిగంత్రమ్య

ఇతర నటీనటులు : సాయి కుమార్రాజేష్ వివేక్దర్శన్సాదు కోకిలఅమిత్ తివారీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ కోడి రామకృష్ణ

ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషిసోహెల్ అన్సారిధవళ్ గాద

రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016

సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి  దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ  శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే  ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం  తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస…  నాగ్ చరణ్  (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసిందిచివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుందిఅనేది ఈ సినిమా స్టోరీ.

=============================================================================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబుసమంత రుత్ ప్రభుకాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్నరేష్సత్యరాజ్జయసుధరేవతిశుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ :  20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరోతన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్సోనాల్ చౌహాన్బ్రహ్మానందంఆదిత్య మీనన్రావు రమేష్పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

కొత్త బంగారు లోకం
నటీనటులు : వరుణ్ సందేశ్శ్వేత బసు ప్రసాద్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్జయసుధఆహుతి ప్రసాద్రజితబ్రహ్మానందం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

DJ – దువ్వాడ జగన్నాథం

నటీనటులు : అల్లు అర్జున్పూజా హెగ్డే

ఇతర నటీనటులు చంద్ర మోహన్రావు రమేష్మురళి శర్మసుబ్బరాజుపోసాని కృష్ణ మురళితనికెళ్ళ భరణివెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 23 జూన్ 2017

విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

=============================================================================

స్పైడర్
నటీనటులు మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.