జీ సినిమాలు ( 28th ఏప్రిల్ )

Thursday,April 27,2017 - 10:03 by Z_CLU

నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : శుభలేఖ సుధాకర్, పూర్ణిమ, సుత్తి వీరభద్ర రావు, సుత్తివేలు, కోట శ్రీనివాస రావు, బెనర్జీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : రేలంగి నరసింహా రావు

ప్రొడ్యూసర్ :   మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 1987

రేలంగి నరసింహా రావు డైరెక్షన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ గుండమ్మ గారి కృష్ణులు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కరియర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిందీ ఈ సినిమా. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

=============================================================================

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

నటీ నటులు : వెంకటేష్, రంభ, మధుబాల

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, చంద్ర మోహన్, కోట శ్రీనివాస్ రావు, రేవతి, అశోక్ కుమార్.

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : తిరుపతిస్వామి

నిర్మాత : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 19 జూన్ 1998

‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్- గణేష్’ . ఈ డైలాగ్ కొన్ని రోజుల వరకు యూత్ నోటిలో ఊతపదంలా వినిపించేది అంత ఇంపాక్ట్ చూపించింది గణేష్ సినిమా. ఒక సాధారణ జర్నలిస్ట్ రోల్ లో అతి సహజంగా నటించాడు విక్టరీ వెంకటేష్. కరప్టెడ్ డాక్టర్స్ వల్ల తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో, తిరగబడ్డ గణేష్ ఎలా సంఘ విద్రోహులను మట్టి కరిపించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ గణేష్. మణిశర్మ సంగీతం సినిమాకి ఎసెట్.

==============================================================================

నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్

ఇతర నటీనటులు : మనోజ్ K జయన్, కళాభవన్ మణి, బిజు మీనన్, రియా సేన్, కొచిన్ హనీఫా, సురేష్ కృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్

డైరెక్టర్ : సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005

పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

నటీ నటులు : శ్రీహరి, సుహాసిని  షామ్న

ఇతర నటీనటులు : సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. పవర్ ఫుల్ లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీహరి నటన సినిమాకే హైలెట్. శ్రీహరికి అక్కగా సుహాసినీ మణిరత్నం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ  హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా..? లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఆ కేసును ఎలా చేధించాడు అన్నదే ప్రధాన కథాంశం.