జీ సినిమాలు ( 27th జూలై )

Friday,July 26,2019 - 10:03 by Z_CLU

యోగి
నటీనటులు : ప్రభాస్నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

రెడీ
నటీనటులు : రామ్, జెనీలియా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008
రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

శ్రీమంతుడు
నటీనటులు : మహేష్ బాబుశృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

హైపర్
నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

శివాజీ

నటీనటులు రజినీకాంత్శ్రియ శరన్

ఇతర నటీనటులు : వివేక్సుమన్రఘువరన్మణివన్నన్వడివుక్కరసికోచిన్ హనీఫా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : S.శంకర్

ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్

రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్యవైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..లేదా..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================================================================

కుక్కలున్నాయి జాగ్రత్త

నటీనటులు : సిబిరాజ్అరుంధతి

ఇతర నటీనటులు : ఇదోబాలాజీ వేణుగోపాల్మనోబాలమయిల్ సామిప్రింజ్ నితిక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్

డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్

ప్రొడ్యూసర్ సత్యరాజ్మహేశ్వరి సత్యరాజ్

రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014

సిబిరాజ్అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.