జీ సినిమాలు ( 27th ఏప్రిల్ )

Wednesday,April 26,2017 - 10:08 by Z_CLU

నటీనటులు : వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి

ఇతర నటీనటులు : వాణిశ్రీ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : P.S. రామచంద్రా రావు

ప్రొడ్యూసర్ : కోసూరి శ్రీదేవి

రిలీజ్ డేట్ : 1993

ఫ్యామిలీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వినోద్, రోజా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అత్తకు కొడుకు మామకు అల్లుడు. అప్పటికే సిల్వర్ స్క్రీన్ పై అత్తగా వెలిగిపోతున్న సీనియర్ నటి వాణిశ్రీ, సత్యనారాయణకు అల్లుడుగా నటించాడు వినోద్ కుమార్. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

నటీ నటులు : సుమంత్ అశ్విన్, ఈషా

ఇతర నటీనటులు : మధుబాల, శ్రీనివాస్ అవసరాల, రవి బాబు, రోహిణి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ :  23 ఆగష్టు 2013

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరవాత’ ఒక మెచ్యూర్డ్ లవ్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్, ఈషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మధుబాల, రవిబాబులు కీలక పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకి ఎసెట్.

=============================================================================

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

==============================================================================

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

=============================================================================

నటీ నటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన,  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన  తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

==============================================================================

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.