
ఒక ఊరిలో
నటీనటులు : తరుణ్, రాజా, సలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005
లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.
____________________________________________

నవ వసంతం
నటీనటులు : తరుణ్, ప్రియమణి
ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్
డైరెక్టర్ : కె.షాజహాన్
ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి
రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007
తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్.
________________________________________________

ఒరేయ్ బుజ్జిగా
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, మధునందన్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు: నంద్యాల రవి
ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.
రన్ టైమ్ : 2 గంటల 28 నిమిషాలు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 1
బుజ్జి (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ది ఒకటే ఊరు. కానీ ఎక్కువగా బయట చదువుకోవడం వల్ల ఒకరంటే ఒకరికి తెలియదు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన బుజ్జికి పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (పోసాని). అదే టైమ్ లో కృష్ణవేణికి కూడా పెళ్లిచేయాలనుకుంటుంది తన అమ్మ (వాణి విశ్వనాథ్). అప్పటికే సుజన (హెబ్బ పటేల్)తో ప్రేమలో పడిన బుజ్జి, అమ్మ చూసిన సంబంధం ఇష్టంలేక కృష్ణవేణి ఇంటి నుంచి పారిపోతారు.
వీళ్లిద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఒకే ట్రయిన్ ఎక్కడం చూసిన ఆ ఊరి వ్యక్తి ఇద్దరూ కలిసి లేచిపోయారని పుకారు పుట్టిస్తాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతుంటాయి. అదే టైమ్ లో హైదరాబాద్ లో అనుకోకుండా కలిసిన బుజ్జి-కృష్ణవేణి ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే ఊరిలో పుకారు గురించి తెలుసుకున్న బుజ్జి, ఎలా ఉంటుందో కూడా తెలియని కృష్ణవేణిపై కోపం పెంచుకుంటాడు. కృష్ణవేణికి కూడా బుజ్జిపై కోపం ఉంటుంది. ఈ క్రమంలో కృష్ణవేణి మేనమామ (రాజారవీంద్ర)కు ఆమెను అప్పగించేస్తాడు బుజ్జి.
ఫైనల్ గా బుజ్జి, తన కృష్ణవేణిని చేరుకున్నాడా లేదా.. గొడవలు పడుతున్న రెండు కుటుంబాల్ని ఎలా కలిపాడనేది స్టోరీ.
_______________________________________

బొమ్మరిల్లు
నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006
తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.
_________________________________________

దేవదాస్
నటీనటులు : నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్
ఇతర నటీనటులు : R. శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, నరేష్, సత్య కృష్ణన్, మురళీ శర్మ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.
మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.
___________________________________________

అర్జున్ సురవరం
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
బ్యానర్: ఈరోస్ ఇంటర్నేషనల్, మూవీ డైనమిక్స్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: సామ్ సి.ఎస్.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్
విడుదల తేదీ: నవంబర్ 29, 2019
అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.