జీ సినిమాలు (25th మార్చ్)

Tuesday,March 24,2020 - 08:01 by Z_CLU

కిల్లర్
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్
సంగీతం : సైమన్ కే కింగ్
సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ : మాక్స్
ఎడిటర్ : రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.


స్టూడెంట్ నంబర్ 1
నటీనటులు : N.T.R., గజాల
ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : S.S. రాజమౌళి
ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001

ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.

దువ్వాడ జగన్నాధమ్
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 23 జూన్ 2017

విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

ఆజాద్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పాషెట్టి, రఘువరన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: వైజయంతీ మూవీస్
నిర్మాత: అశ్వనీదత్
దర్శకుడు: తిరుపతి స్వామి
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 29, 2000

తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున చేసిన సినిమా ఆజాద్. దేశభక్తి కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇక సౌందర్య నటన, శిల్పాషెట్టి అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ఈ సినిమాకు తిరుపతి స్వామితో పాటు యండమూరి వీరేంద్రనాథ్, భూపతిరాజా, క్రేజీ మోహన్ లాంటి ప్రముఖులు స్క్రీన్ ప్లే అందించారు.

అరవింద సమేత
నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే తదితరులు
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాణం : హారిక & హాసినీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్.రాథాకృష్ణ (చిన బాబు)
రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
రిలీజ్ డేట్: 11 అక్టోబర్, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో యాక్షన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత (వీర రాఘవ)’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్.రాదా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సుప్రీమ్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా
ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : అనిల్ రావిపూడి
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.