జీ సినిమాలు ( 25th జూన్ )

Monday,June 24,2019 - 10:03 by Z_CLU

గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజుతనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

=============================================================================

సౌఖ్యం

నటీనటులు గోపీచంద్రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషిప్రదీప్ రావత్దీవన్బ్రహ్మానందంజయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్రెజీనా జంటగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

శివాజీ

నటీనటులు : రజినీకాంత్శ్రియ శరన్

ఇతర నటీనటులు : వివేక్సుమన్రఘువరన్మణివన్నన్వడివుక్కరసికోచిన్ హనీఫా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : S.శంకర్

ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్

రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్యవైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..లేదా..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు : వెంకటేష్త్రిష
ఇతర నటీనటులు : శ్రీరామ్, K. విశ్వనాథ్కోట శ్రీనివాస రావుస్వాతి రెడ్డిసునీల్ప్రసాద్ బాబుసుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

============================================================================

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు : రామ్ పోతినేనిఅనుపమ పరమేశ్వరన్లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణుప్రియదర్శికిరీటి దామరాజుహిమజఅనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యస్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు. ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

==============================================================================

హలో

నటీనటులు : అఖిల్ అక్కినేనికళ్యాణి ప్రియదర్శన్

ఇతర నటీనటులు : జగపతి బాబురమ్యకృష్ణఅజయ్సత్య కృష్ణన్అనీష్ కురువిల్ల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : విక్రమ్ కుమార్

ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017 

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీనుజున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరుఅవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.