జీ సినిమాలు ( 25th జూన్ )

Monday,June 25,2018 - 12:10 by Z_CLU

లియుగ పాండవులు 

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

==============================================================================

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన, ఐశ్వర్య షిందోగి, మదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ : లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

భాయ్
నటీనటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్ దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి
ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున
రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

పాపనాశం

నటీనటులు : కమల హాసన్, గౌతమి, నివేద థామస్

ఇతర నటీనటులు : ఎస్తర్ అనిల్, కళాభవన్ మణి, ఆశా శరత్, అనంత్ మహదేవన్, M.S. భాస్కర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : జీతూ జోసెఫ్

ప్రొడ్యూసర్ : సురేష్ బాలాజీ, జార్జి పియూష్

రిలీజ్ డేట్ : 3 జూలై 2015

కమల హాసన్ , గౌతమి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ థ్రిల్లర్ పాపనాశం. పాపనాశం అనే ఊళ్ళో కేబుల్ టి.వి. ఆపరేటర్ అయిన హీరో, అనుకోని విపత్తులో తనకుటుంబం ఇరుక్కున్నప్పుడు తనకున్న సినిమా నాలెడ్జ్ తో తనవారిని ఎలా కాపాడుకున్నాడు అనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిందే పాపనాశం. సినిమాలో కమలహాసన్ పర్ఫామెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం 

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

 అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే సినిమా ప్రధాన కథాంశం. కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచింది.