జీ సినిమాలు ( 25th జనవరి )

Thursday,January 24,2019 - 10:03 by Z_CLU

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ మీరా జాస్మీన్
ఇతర నటీ నటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

=============================================================================

చినబాబు

నటీనటులు : కార్తీ, సాయేషా

ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్ : సూర్య

రిలీజ్ డేట్ : 13 జూలై 2018

రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదుజీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.

కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.

మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడాచివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడుకుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

బాడీగార్డ్

నటీనటులు : వెంకటేష్త్రిషసలోని అశ్వని,

ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావుజయ ప్రకాష్ రెడ్డిసుబ్బరాజుతనికెళ్ళ భరణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2012

వెంకటేష్త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ  వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

సౌఖ్యం

నటీనటులు : గోపీచంద్, రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, దీవన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఫ్యాఅమిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్, ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.