జీ సినిమాలు ( 24th సెప్టెంబర్ )

Sunday,September 23,2018 - 10:06 by Z_CLU

స్ట్రాబెర్రీ
నటీనటులు : పా. విజయ్ , అవని మోడీ
ఇతర నటీనటులు : సముథిరఖని , యువీని పార్వతి, వేత్రి, దేవయాని, కవితాలయ కృష్ణన్ తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్
డైరెక్టర్ : పా.విజయ్
ప్రొడ్యూసర్ : పా.విజయ్
రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్ 2015
పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘స్ట్రాబెరి’. ఈ సినిమాలో హారర్ కామెడీ , రొమాంటిక్ సీన్స్, తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

==============================================================================

చందమామ
నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్
ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్
రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007
కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

అందాల రాముడు
నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్
ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్
రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006
సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

==============================================================================

చిరుత
నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

==============================================================================

కాష్మోరా
నటీనటులు : కార్తీ, నయనతార
ఇతర నటీనటులు : సి.దివ్య, శరత్ లోహిత్ వాలా, మధుసూదన్ రావు, పట్టిమంద్రం రాజా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్
డైరెక్టర్ : గోకుల్
ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు
రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016
ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓపాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం.

==============================================================================

నక్షత్రం
నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా
ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్
రిలీజ్ డేట్ : 4 ఆగష్టు
రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.