జీ సినిమాలు ( 24th నవంబర్ )

Sunday,November 24,2019 - 10:02 by Z_CLU

కణం
నటీనటులు : నాగశౌర్యసాయి పల్లవి
ఇతర నటీనటులు బేబీ వెరోనికాప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ లైకా ప్రొడక్షన్స్
కృష్ణ (నాగ శౌర్య)తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

=============================================================================

దేవత

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి
ఇతర 
నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయిచీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది వెంటనే  సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుందిఅదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయివాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయికానీ దేవతలోని  పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందిసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.

==============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్జ్యోతికరిచా గంగోపాధ్యాయశ్రద్దా దాస్కమలినీ ముఖర్జీపూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

బొమ్మరిల్లు
నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006
తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

అహ నా పెళ్ళంట
నటీనటులు అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011
రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.