జీ సినిమాలు ( 24th మే)

Tuesday,May 23,2017 - 10:03 by Z_CLU

మహా శివరాత్రి

నటీనటులు : మీనా, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్

ఇతర నటీనటులు : శ్రీధర్, ఆనంద వేలు, ఉమేష్, శ్రీ లలిత, శ్రియ, అనురాధ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీశైల

డైరెక్టర్ : రేణుకా శర్మ

ప్రొడ్యూసర్ : K. శ్రీహరి

రిలీజ్ డేట్ : 2000

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, డైలాగ్ కింగ్ సాయికుమార్, మీనా నటించిన మహా శివరాత్రి సినిమాకి రేణుకా శర్మ డైరెక్టర్. భక్తి సినిమా తరహానే అయినా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది మహా శివరాత్రి.

==============================================================================

ఒక ఊరిలో

నటీ నటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

భీమిలి కబడ్డీ జట్టు 

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

==============================================================================

 

 ఆ ఇంట్లో

నటీ నటులు : చిన్నా, మయూరి,

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

ఇంద్రుడు 

హీరో హీరోయిన్స్ : విశాల్,లక్ష్మి మీనన్

ఇతర నటీ నటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్

నిర్మాత : విశాల్. రోన్ని,సిద్దార్థ్

దర్శకత్వం : తిరు

విశాల్- లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిసార్డర్ తో భాధ పడే ఓ యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్ , లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్….

==============================================================================

లక్ష్మీ దుర్గ

నటీ నటులు: బేబీ షామిలీ, నిగళ్ గల్ రవి, కనక

ఇతర నటీనటులు : సత్యప్రియ, శ్రీలక్ష్మి, చంద్ర శేఖర్, కిట్టు, సెంథిల్ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ గణేష్

డైరెక్టర్ : రామ నారాయణ

ప్రొడ్యూసర్స్ : A.మోహన్, C.M. కృష్ణ

బేబీ షామిలి అంటే ఆ రోజుల్లో చాలా క్రేజ్ ఉండేది. అందుకే కొన్ని కథలు కూడా తనకోసమే ప్రత్యేకంగా ప్లాన్ చేసి మరీ తెరకెక్కించారు దర్శకులు. లక్ష్మీదుర్గ లో బేబీ షామిలి డ్యూయల్ రోల్ లో అలరిస్తుంది. దానికి తోడు కుక్క, కోతి నటన కూడా చిన్నపిల్లల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించాదు డైరెక్టర్ రామ నారాయణ.