జీ సినిమాలు ( 24th మార్చి )

Friday,March 23,2018 - 10:02 by Z_CLU

మధుమాసం

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్

ఇతర నటీనటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామానాయుడు

దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు.

==============================================================================

గోదావరి

నటీనటులు : సుమంత్, కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావు, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, శివ, గంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్  టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

==============================================================================

అనసూయ

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

==============================================================================

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్, జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురి, శీలు అబ్రహాం, రమేష్ పిషరోది, సాజు నవోదయ, అక్షర కిషోర్, ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్, నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందని…అందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.