జీ సినిమాలు ( 24th జనవరి )

Wednesday,January 23,2019 - 10:02 by Z_CLU

భగీరథ

నటీనటులు : రవి తేజశ్రియ

ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి 

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజశ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా    భగీరథ‘. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటనశ్రియ గ్లామర్పల్లెటూరి సీన్స్చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

పిల్ల జమీందార్

నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

==============================================================================

మిస్టర్
నటీనటులు : వరుణ్ తేజ్లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : హేబా పటేల్నిఖితిన్ ధీర్ప్రిన్స్ సీసిల్పృథ్వీ రాజ్హరీష్ ఉత్తమన్రవి ప్రకాష్సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరాచై కి ఏం చెప్పిందిచై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరుచివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

సైనికుడు

నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

==============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్సప్తగిరిమధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’  సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ప్రోగ్రాం కామెడీమ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నటీనటులు : సిద్ధార్థతమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్రమ్యకృష్ణబ్రహ్మానందంనాజర్వేణు మాధవ్సుధ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్-ఎహసాన్-లాయ్

డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్ : నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009

పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీతఅక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడోఅప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతోఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.