జీ సినిమాలు ( 23rd నవంబర్ )

Thursday,November 22,2018 - 10:02 by Z_CLU

రాయుడు

నటీనటులు : విశాల్, శ్రీదివ్య

ఇతర నటీనటులు : R.K. సురేష్, కుళ్ళప్పులి లీల, రాధారవి, సూరి, ఆదిర పాండిలక్ష్మి, ఆరుళ్ దాస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : M. ముత్తయ్య

ప్రొడ్యూసర్ : G.N. అంబు చెళియన్   

రిలీజ్ డేట్ : 20 మే 2016

విశాల్, శ్రీదివ్య జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాయుడు. విశాల్ ఈ ఇస్నిమాలో సాధారణ కూలీగా నటించాడు. తను ప్రేమించిన భాగ్యలక్ష్మి ని చంపాలని చూస్తున్న రోలెక్స్ కి ఎదురు తిరిగిన రాయుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురుకుంటాడు..? అసలు రోలెక్స్ భాగ్యలక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటాడు అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

సుడిగాడు

నటీనటులు అల్లరి నరేష్మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందంఆలీ, M.S. నారాయణరఘుబాబువేణు మాధవ్చంద్ర మోహన్చలపతి రావుధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

చింతకాయల రవి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, వేణు తొట్టెంపూడి, శయాజీ షిండే, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్

డైరెక్టర్ : యోగి

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008

చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్, రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది ‘జీ సినిమాలు’ లో చూడాల్సిందే.

==============================================================================

పూజ

నటీనటులు :  విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .

==============================================================================

బ్రూస్ లీ

నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.