జీ సినిమాలు ( 23rd మార్చి )

Thursday,March 22,2018 - 10:19 by Z_CLU

పోసాని జెంటిల్ మెన్

నటీనటులు : పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాగబాబు, M.S. నారాయణ, ఆలీ, సుధ, సురేఖా వాణి తదితరులు

డైరెక్టర్ : పోసాని కృష్ణ మురళి

ప్రొడ్యూసర్ : నల్లం పద్మజ

రిలీజ్ డేట్ : 2009

పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో వచ్చిన డిఫెరెంట్ సినిమా పోసాని జెంటిల్ మెన్. తన భర్త జెంటిల్ మెన్ అని నమ్మే భార్య, తన భర్త నిజాయితీని తెలసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

సమర సింహా

నటీనటులు : ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్, ఆశిష్ విద్యార్థి

మ్యూజిక్ డైరెక్టర్ : S.A.రాజ్ కుమార్

డైరెక్టర్ : S. మహేందర్

నిర్మాత : డి. రత్న కుమార్

ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా సమర సింహా. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ రచించడం విశేషం. ఉపేంద్ర తో పాటు ఆశిష్ విద్యార్థి నటన సినిమాకు హైలెట్.

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

కౌసల్య సుప్రజా రామా

నటీనటులు : శ్రీకాంత్, చార్మీ

ఇతర నటీనటులు : శివాజీ, గౌరీ ముంజల్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కృష్ణ భగవాన్, L.B. శ్రీరామ్, చలపతి రావు, హేమ, సన తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : సూర్య ప్రసాద్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 2008 అక్టోబర్ 9

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తో రామానాయుడు గారు నిర్మించిన నాలుగో సినిమా కౌసల్యా సుప్రజా రామ. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకుడు.

==============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

ఒకే ఒక్కడు

నటీనటులు : అర్జున్, మనీషా కొయిరాలా

ఇతర నటీనటులు : సుష్మితా సేన్, రఘువరన్, వడివేలు, మణివణ్ణన్, విజయ్ కుమార్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : శంకర్

ప్రొడ్యూసర్ : శంకర్, మాదేశ్

రిలీజ్ డేట్ : 7 నవంబర్ 1999

అర్జున్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టే యువకుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం పెద్ద ఎసెట్.