జీ సినిమాలు ( 23rd జనవరి )

Wednesday,January 22,2020 - 10:03 by Z_CLU

హ్యాపీ వెడ్డింగ్
నటీనటులు సుమంత్ అశ్విన్నిహారిక
ఇతర నటీనటులు : మురళీ శర్మనరేష్పవిత్ర లోకేష్తులసిఇంద్రజపూజిత పున్నాడ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శశికాంత్ కార్తిక్తమన్
డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
ప్రొడ్యూసర్: M. సుమంత్ రాజు
రిలీజ్ డేట్ : జూలై 28, 2018
విజయవాడ కుర్రాడు ఆనంద్(సుమంత్ అశ్విన్)హైదరాబాద్ అమ్మాయి అక్షర(నీహారిక) ప్రేమించుకుంటారు. ఇరువురి కుటుంబ పెద్దలు వీరికి పెళ్లి ఖాయం చేసి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఇంతలో గతంలో అక్షర ప్రేమికుడు విజయ్(రాజా) తిరిగి వస్తాడు. గతంలో ఇద్దరు కలిసి చేసిన బొటీక్ బిజినెస్ పేరుతో తనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు విజయ్. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యే అక్షర.. పెళ్లి దాకా వచ్చి ప్రేమ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది.
ఈ క్రమంలో ఆనంద్ కి కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. ఆనంద్ మాత్రం అక్షరను విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్షరలో మార్పు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. చివరికి అక్షర పెళ్లి ఆనంద్ తోనే జరిగిందా.. లేదా మాజీ ప్రేమికుడు విజయ్ తో జరిగిందా ? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

==============================================================================

సౌఖ్యం 

నటీనటులు గోపీచంద్, రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, దీవన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవలంటే ఇష్టపడని హీరో ఫాదర్, ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

===========================================================================

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీరాజేంద్ర ప్రసాద్కబెర్ దుహాన్ సింగ్రవి కిషన్సాయి కుమార్మురళీ మోహన్తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన  సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

అదిరిందయ్యా చంద్రం

నటీనటులు  – శివాజీలయ

ఇతర నటీనటులు – సంగీతమధుశర్మబ్రహ్మానందంఅలీవేణుమాధవ్ఏవీఎస్

మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్  – శ్రీనివాసరెడ్డి

రిలీజ్ డేట్  – 2005, ఆగస్ట్ 20

శివాజీలయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

=============================================================================

శివాజీ

నటీనటులు రజినీకాంత్శ్రియ శరన్

ఇతర నటీనటులు : వివేక్సుమన్రఘువరన్మణివన్నన్వడివుక్కరసికోచిన్ హనీఫా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : S.శంకర్

ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్

రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్యవైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..లేదా..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

విశ్వామిత్ర

నటీనటులు : ప్రసన్న, నందితా రాజ్

ఇతర నటీనటులు : ఆషుతోష్ రానా, సత్యం రాజేష్, విద్యుల్లేఖ రామన్, జీవ, సత్య  మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్స్ : మాధవి అద్దంకి, S. రజినీకాంత్, ఫణి తిరుమలశెట్టి

రిలీజ్ డేట్ : 14 జూన్ 2019

అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. ఆమె అంటే అందరికీ ఇష్టమే. ఆఫీస్ లో ఆమె బాస్ మాత్రం నందితను మరో రకంగా చూస్తుంటాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నందిత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు సమస్య ఎదురైన ప్రతిసారి ఓ అజ్ఞాతవ్యక్తి వచ్చి రక్షిస్తుంటాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.

నందితకు పోలీసాఫీసర్ ప్రసన్న మంచి ఫ్రెండ్. మాటల సందర్భంలో ఓసారి తన అజ్ఞాత స్నేహితుడి గురించి ప్రసన్నకు చెబుతుంది. నందిత ఎలాంటి అమ్మాయో, ఎంత అమాయకురాలో తెలుసు కాబట్టి ఆమె మోసపోకూడదనే ఉద్దేశంతో, ఆ అజ్ఞాత స్నేహితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసన్న.

ఎంక్వయిరీలో భాగంగా ప్రసన్న, నందితకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నందితను అతడు పదేపదే ఎందుకు రక్షిస్తుంటాడు? తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రసన్న తెలుసుకున్న రహస్యాలేంటి? చివరికి నందిత తన అజ్ఞాత స్నేహితుడ్ని కలుసుకుందా లేదా అనేది క్లయిమాక్స్.