జీ సినిమాలు ( 22nd సెప్టెంబర్ )

Friday,September 21,2018 - 10:04 by Z_CLU

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్

ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్

రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు నిఖిల్ సిద్ధార్థహేబా పటేల్అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేతవెన్నెల కిషోర్అన్నపూర్ణసత్యసుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చిందిఅర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైందిఅసలు అమల ఎవరుకేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడుఅనేది చిత్ర కధాంశం.

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

==============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు మధు నందన్సప్తగిరిమధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ మే 1 , 2014

అల్లు శిరీష్రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’  సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ప్రోగ్రాం కామెడీమ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

బాబు బంగారం

నటీనటులు : వెంకటేష్నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్మురళీ శర్మజయప్రకాష్బ్రహ్మానందంపోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడుచివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడుఅనేది చిత్ర కధాంశం.

==============================================================================

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవిభూమిక చావ్లాసమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్బ్రహ్మానందంజయ ప్రకాష్ రెడ్డిరాహుల్ దేవ్సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

==============================================================================

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచుహన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబుజయప్రకాష్పోసాని కృష్ణమురళిప్రభాస్ శ్రీనుసత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీపద్మ ను ఎలా దక్కించుకున్నాడుఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడుచివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడుఅనేది సినిమా కథాంశం.