జీ సినిమాలు (22nd మార్చ్ )

Saturday,March 21,2020 - 10:02 by Z_CLU

కథకళి

నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా

ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ

డైరెక్టర్ పాండిరాజ్

ప్రొడ్యూసర్ : పాండిరాజ్

రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 

విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

_______________________________________

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కథాంశం.

___________________________________________

బూమరాంగ్

నటీనటులు : అధర్వ, మేఘా ఆకాష్, ఇందూజ రవిచంద్రన్, సతీష్‌, ఆర్జే బాలాజీ, ఉపెన్‌ పటేల్‌ తదితరులు

సంగీతం: రధన్

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఆర్‌ కణ్ణన్‌

నిర్మాత: సీహెచ్‌ సతీష్‌కుమార్‌

నిడివి: 129 నిమిషాలు

సెన్సార్: U

రిలీజ్ డేట్: జనవరి 3, 2020

ఫుట్ బాల్ ప్లేయర్ శివ ఓ యాక్సిడెంట్ లో తన ముఖం మొత్తం పోగొట్టుకుంటాడు. అదే టైమ్ లో హాస్పిటల్ చావు బతుకుల మధ్య ఉంటాడు శక్తి. ఇద్దరి పొజిషన్ క్రిటికల్ గా ఉన్న టైమ్ లో శక్తి చనిపోతాడు. శివ మాత్రం బతుకుతాడు. కానీ అతడి ముఖం పూర్తిగా పోతుంది. దీంతో డాక్టర్లు శక్తి ముఖాన్ని తెచ్చి శివకు అతికిస్తారు. అలా సరికొత్త ముఖంతో మళ్లీ బతికిన శివ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రిజెక్ట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ కూడా తిరిగొస్తుంది.

అంతా సాఫీగా సాగిపోతుందనున్న టైమ్ లో శివ జీవితంలో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొంతమంది శివను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొంతమంది అతడ్ని బాగా తెలిసినవాడిగా పలకరిస్తుంటారు. దీంతో శివ అయోమయానికి గురవుతాడు. తనకు పెట్టిన శక్తి ముఖం ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.

ఈ ప్రయత్నంలో శివ తెలుసుకున్న నిజాలేంటి? శక్తి ప్రారంభించిన మిషన్ ను శివ పూర్తిచేస్తాడా లేదా అనేది మిగతా కథ.

______________________________________________

కందిరీగ

నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

________________________________

బెండు అప్పారావు R.M.P.

నటీనటులు : అల్లరి నరేష్కామ్న జెఠ్మలానీ

ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్మేఘన రాజ్ఆహుతి ప్రసాద్రఘుబాబు, L.B. శ్రీరామ్ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినాచిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.