జీ సినిమాలు ( 22nd జూన్)

Wednesday,June 21,2017 - 10:03 by Z_CLU

తాజ్ మహల్

నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

టక్కరి

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

============================================================================

 

నాగవల్లి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ : P.   వాసు

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010

విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=============================================================================

రామ్ 

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. శంకర్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

=============================================================================

దోచెయ్ 

హీరో హీరోయిన్లు – నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

సంగీతం – సన్నీ

దర్శకత్వం – సుధీర్ వర్మ

విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

=============================================================================

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి

ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్

డైరెక్టర్ : V.C. వడివుడియన్

ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్

రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

డైనోషార్క్

నటీనటులు : ఎరిక్ బాల్ఫోర్, ఐవా హ్యాస్పర్గర్

ఇతర నటీనటులు : ఆరోన్ డియాజ్, రోజర్ కార్మన్, వెల హామ్మండ్, బ్లాంచ్ వీలర్, షాన్ కార్సన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సింథియా బ్రౌన్

డైరెక్టర్ : కెవిన్ ఓ’ నీల్

ప్రొడ్యూసర్ : రోజర్ కార్మన్, జూలీ కార్మన్

రిలీజ్ డేట్ : మార్చ్ 13, 2010

సింథియా బ్రౌన్ డైరెక్షన్ లో తెరకెక్కిన డైనోషార్క్ పర్ ఫెక్ట్ థ్రిల్లర్. ఒక ఫెరోషియస్ డైనోషార్క్ సముద్ర తీరానికి వచ్చిన యాత్రికులని, తినేస్తుంటుంది. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది..? తెలిశాక ఏం జరుగుతుంది అనేదే ప్రధాన కథాంశం.