జీ సినిమాలు ( 22nd డిసెంబర్ )

Saturday,December 21,2019 - 10:03 by Z_CLU

ఆచారి అమెరికా యాత్ర
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

==============================================================================

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్, తమన్నా

ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

==============================================================================

విన్నర్

నటీనటులు సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

=============================================================================

సాక్ష్యం

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్పూజా హెగ్డే

ఇతర నటీనటులు : శరత్ కుమార్మీనాజగపతి బాబురవి కిషన్ఆశుతోష్ రానామధు గురుస్వామి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా

రిలీజ్ డేట్ : 27 జూలై 2018

స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగాఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకుఅక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.

అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడుపురాణాలుఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.

ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.