జీ సినిమాలు ( 22nd ఏప్రిల్ )

Sunday,April 21,2019 - 10:33 by Z_CLU

చిన్నారి
నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన, ఐశ్వర్య షిందోగి, మధుసూధన రావు
మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్
డైరెక్టర్ : లోహిత్ M.
ప్రొడ్యూసర్ : K. రవి కుమార్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016
ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.
ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================


హలో
నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్
ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017
చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

==============================================================================


హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

రంగుల రాట్నం
నటీనటులు : రాజ్ తరుణ్, శుక్లా
ఇతర నటీనటులు : సితార, ప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

=============================================================================


అ..ఆ…
నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 2 జూన్ 2016
నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

==============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం
నటీనటులు : సిద్ధార్థ, తమన్నా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, నాజర్, వేణు మాధవ్, సుధ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్-ఎహసాన్-లాయ్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009
పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీత, అక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడో, అప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతో, ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..? తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.