జీ సినిమాలు ( 21st జూన్ )

Wednesday,June 20,2018 - 10:07 by Z_CLU

భయ్యా

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

గోదావరి

నటీనటులు : సుమంత్, కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావు, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, శివ, గంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్  టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

 బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

మహానంది

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీనటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

==============================================================================

జయసూర్య

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : సముథిరఖని, సూరి, DMJ రాజసింహన్, ఐశ్వర్య దత్త తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంథిరణ్

ప్రొడ్యూసర్ : S. మదన్

రిలీజ్ డేట్ : 4 సెప్టెంబర్ 2015

విశాల్, కాజల్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జయసూర్య. సిటీలో కిడ్నాప్ లు చేసి భయ భ్రాంతులకు గురి చేసే క్రిమినల్స్ కి మధ్య జరిగే క్రైం థ్రిల్లర్ ఈ సినిమా. ACP  జయసూర్యగా విశాల్ నటన సినిమాకే హైలెట్.