
ఆ ఇంట్లో
నటీనటులు : చిన్నా, మయూరి
ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : చిన్న
ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి
రిలీజ్ డేట్ : 2009
చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.
=============================================================================

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003
స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.
==============================================================================

కథానాయకుడు
నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008
ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.
==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు : వెంకటేష్, త్రిష
ఇతర నటీనటులు : శ్రీరామ్, K. విశ్వనాథ్, కోట శ్రీనివాస రావు, స్వాతి రెడ్డి, సునీల్, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.
==============================================================================

DJ – దువ్వాడ జగన్నాథం
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 23 జూన్ 2017
విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.
==============================================================================

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.