జీ సినిమాలు ( 20th అక్టోబర్ )

Saturday,October 19,2019 - 10:02 by Z_CLU

పోలీస్ స్టోరీ-2
హీరో – సాయికుమార్
ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం
సంగీతం ఆర్పీ పట్నాయక్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు
విడుదల తేదీ – 1996
అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2నుతెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడాపనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే.

=============================================================================

లీడర్
నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్
డైరెక్టర్ : శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్
రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010
రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.

=============================================================================

యోగి
నటీనటులు : ప్రభాస్, నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

యుగానికి ఒక్కడు

నటీనటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓఅమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తోతెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకిప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లోకార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

=============================================================================

శకుని

నటీనటులు : కార్తీ, ప్రణీత
ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : శంకర్ దయాళ్
ప్రొడ్యూసర్ : S. R. ప్రభు
రిలీజ్ డేట్ : 22 జూన్ 2012
కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.