జీ సినిమాలు ( 20th జనవరి )

Friday,January 19,2018 - 10:03 by Z_CLU

ఈనాడు

నటీనటులు : కమల హాసన్, వెంకటేష్

ఇతర నటీనటులు : గణేష్ వెంకటరామన్, Dr.భారతీ రెడ్డి, సంతాన భారతి, శ్రీమాన్, ప్రేమ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శృతి హాసన్

డైరెక్షన్ : చక్రి తోలేటి

ప్రొడ్యూసర్ : కమల హాసన్

రిలీజ్ డేట్ : 19 సెప్టెంబర్ 2016

కమల్ హాసన్, వెంకటేష్ నటించిన నటించిన ఈనాడు సినిమా ఏ నటుడైనా చేసి తీరాలి అనుకున్న స్టోరీ, ప్రేక్షకులు చూసి తీరాలి అనుకునే సినిమా. సరికొత్త కథనంతో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కిందే ఈనాడు. ఇందులో కమల హాసన్ యాక్టింగ్ హైలెట్.

==============================================================================

బంపర్ ఆఫర్ 

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

==============================================================================

పవిత్ర ప్రేమ

హీరో  హీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, జూన్ 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

==============================================================================

సైనికుడు

నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

=============================================================================

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి

ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్

డైరెక్టర్ : V.C. వడివుడియన్

ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్

రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

భీమవరం బుల్లోడు

నటీనటులు : సునీల్, ఎస్తర్ నోరోన్హా

ఇతర నటీనటులు : విక్రమ్ జీత్ విర్క్, సాయాజీ షిండే, రఘుబాబు, సుబ్బరాజు, సత్య రాజేష్, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఉదయ్ శంకర్

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2014

తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న రాంబాబు, ఆ మిగిలిన కొన్ని రోజులు సొసైటీలో చేంజ్ తీసుకురావడం  కోసం స్పెండ్ చేయాలనుకుంటాడు. అల్టిమేట్ గా తన చుట్టూరా జరుగుతున్న రౌడీయిజాన్ని అంతం చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తీరా కొన్ని రోజుల తరవాత తన ప్రాణాలకు ఏ ఆపద లేదని, అసలు తనకు బ్రెయిన్ ట్యూమరే లేదని తెలుస్తుంది రాంబాబుకి. ఆ తర్వాత రాంబాబు ఏం చేస్తాడు..? మళ్ళీ మునుపటిలాగే సాధారణంగా బ్రతికేస్తాడా..? సొసైటీ కోసం తను చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడా..? అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం.