జీ సినిమాలు ( 20th ఆగష్టు)

Saturday,August 19,2017 - 10:08 by Z_CLU

భలే దొంగలు

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

==============================================================================

ఒంగోలుగిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

=============================================================================

శివయ్య

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి

ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ

డైరెక్టర్ : సురేష్ వర్మ

ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

==============================================================================

 

అహ నా పెళ్ళంట

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

==============================================================================

   

భగీరథ

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవితేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి.

=============================================================================

  

సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=============================================================================

 

మడతకాజా

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.