జీ సినిమాలు ( ఏప్రిల్ 20th)

Wednesday,April 19,2017 - 10:07 by Z_CLU

నటీనటులు : రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యా దాస్

ఇతర నటీనటులు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లాది రాఘవ, MVS హరనాథ రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వెంకటేశ్వర

డైరెక్టర్ : వర్మ

ప్రొడ్యూసర్ : 9 మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2005

అల్లరిచిల్లరగా తిరిగే ముగ్గురు యువకులు, టెన్నిస్ చాంపియన్ కావాలని కలలు కంటున్న ఒక అమ్మాయి కలను నిజం చేయడానికి ఏం చేశారు..? ఆ ప్రయత్నం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్నదే ఈ సినిమా కథాంశం.

==============================================================================

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఇతర నటీనటులు : A.V.S, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, గుండు సుదర్శన్, జెన్నీ, మాస్టర్ ఉదయ్, బేబీ అనురాధ

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : గవర పార్థ సారథి

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 1993

బాపు గారు తెరకెక్కించిన అద్భుతాలలో Mr. పెళ్ళాం ఒకటి. ఆలు, మగలలో ఎవరు గొప్ప అనే సున్నితమైన అంశంతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ‘మిస్టర్ పెళ్ళాం’ లో రాజేంద్ర ప్రసాద్. ఆమని జంటగా నటించారు. ఈ సినిమాకి M.M. కీరవాణి సంగీతం అందించారు.

==============================================================================

నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

==============================================================================

నటీనటులు : నాగబాబు, సాయి కుమార్, శిల్ప

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, AVS, బాబు మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : లెనినా చౌదరి

డైరెక్టర్ : పోసాని కృష్ణ మురళి

రిలీజ్ డేట్ : 2008

నాగబాబు సాయికుమార్ నటించిన ఆపద మొక్కులవాడు పక్కా పొలిటికల్ ఎంటర్ టైనర్. పోసానో కృష్ణ మురళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగబాబు పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

============================================================================== 

నటీ నటులు : గోపీచంద్, భావన

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వర రావు, అజయ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : B.V.రమణ

ప్రొడ్యూసర్ : పోకూరి బాబు రావు

రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2008

గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంటరి. హ్యాండ్ లూం హౌజ్ ఓనర్ గా కొడుకు వంశీ గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా తన అమ్మా, నాన్నను ఒప్పించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునే లోపు బుజ్జిని ఎవరో కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వంశీ ఏం చేస్తాడు..? తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ఒంటరి. ఈ సినిమాకి B.V.రమణ డైరెక్టర్.

=============================================================================

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

==============================================================================

 

హీరోహీరోయిన్లు ఏఎన్నార్వాణిశ్రీ

నటీనటులు గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజబాబు

సంగీతం కె.వి.మహదేవన్

దర్శకత్వం కేఎస్ ప్రకాశరావు

విడుదల తేదీ –1971, సెప్టెంబర్ 24

అక్కినేని నాగేశ్వరరావు సినీప్రస్థానంలో ఓ మైలురాయి ప్రేమ్ నగర్. అప్పటికే నవలా నాయకుడిగా స్థిరపడిపోయిన అక్కినేనికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఈ సినిమా. కౌసల్యాదేవి రచించిన ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీచరిత్రలో అతిగొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అంతకుముందు కొన్ని సినిమాలతో నష్టాలు చూసిన రామానాయుడు… ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలదొక్కుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తర్వాత తమిళం, హిందీలో భాషల్లో కూడా రీమేక్ చేశారు.