జీ సినిమాలు ( మార్చి 1st)

Tuesday,February 28,2017 - 10:07 by Z_CLU

నటీనటులు  – కృష్ణ, శ్రీదేవి

ఇతర నటీనటులు – రావుగోపాలరావు, మంజుల, సులక్షణ, సుధాకర్, రంగనాథ్, మిక్కిలినేని

మ్యూజిక్ డైరెక్టర్  – ఎమ్మెస్ విశ్వనాథన్

డైరెక్టర్  – పి.సాంబశివరావు

విడుదల తేదీ – 1982

అప్పటికే హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన చిత్రం ప్రేమ నక్షత్రం. టైటిల్ కు తగ్గట్టు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అప్పట్లో ఈ సినిమాను చూసినప్పటికీ… విడుదలైన తర్వాత కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేమనక్షత్రం పేరుతెచ్చుకుంది. ఈ సినిమాతో కృష్ణ-శ్రీదేవి జంటకు మరిన్ని మార్కులు పడ్డాయి. రావుగోపాల్రావు పర్ ఫార్మెన్స్, ఎం.ఎస్ స్వామినాథన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.

==============================================================================

నటీనటులు : అక్కినేని నాగార్జున, విజయ శాంతి

ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, నర్రా వెంకటేశ్వర రావు, చలపతి రావు.

మ్యూజిక్ డైరెక్టర్  : చక్రవర్తి

డైరెక్టర్ : బి. గోపాల్

నిర్మాత : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 19 జనవరి, 1989

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కరియర్ లో రికార్డ్ అయిన బెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో విజయ్ ఒకటి. B. గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానాలతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

============================================================================

నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.

===========================================================================

నటీనటులు : విశాల్, భారతీ రాజా, లక్ష్మీ మీనన్

ఇతర నటీనటులు : సూరి, విక్రాంత్, శరత్ లోహితశ్వ, హరీష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2013

విశాల్, విక్రాంత్, లక్ష్మీ మీనన్ నటించిన డ్రామా థ్రిల్లర్ పలనాడు. ఒక చిన్న మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్  నడుపుకునే సాధారణ యువకుడి జీవితాన్ని ఒక చిన్న సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే కథాంశంతో తెరకెక్కిందే పలనాడు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుసీంతిరన్ దర్శకత్వం వహించాడు.

=============================================================================

నటీనటులు  సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు నవదీప్, హన్సిక,

మ్యూజిక్ డైరెక్టర్  రాహుల్ రాజ్

ప్రొడ్యూసర్దిల్ రాజు

డైరెక్టర్వేణుశ్రీరాం

రిలీజ్ డేట్  2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

==============================================================================

నటీనటులు : నవదీప్, స్వాతి రెడ్డి

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్, సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచలన

మ్యూజిక్ డైరెక్టర్ : మహేష్ శంకర్

డైరెక్టర్ : రాజ్ పిప్పళ్ళ

ప్రొడ్యూసర్ : సునీత తాటి

రిలీజ్ డేట్ : 7 మార్చి 2014

నవదీప్, స్వాతి జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ బంగారు కోడిపెట్ట. రాజ్ పిప్పళ్ళ డైరక్షన్ చేసిన ఈ సినిమాకి మహేష్ శంకర్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.