జీ సినిమాలు ( 1st ఫిబ్రవరి )

Thursday,January 31,2019 - 10:03 by Z_CLU

హ్యాపీ వెడ్డింగ్
నటీనటులు : సుమంత్ అశ్విన్నిహారిక
ఇతర నటీనటులు : మురళీ శర్మనరేష్పవిత్ర లోకేష్తులసిఇంద్రజపూజిత పున్నాడ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ శశికాంత్ కార్తిక్తమన్
డైరెక్టర్ : లక్ష్మణ్ కార్య
ప్రొడ్యూసర్: M. సుమంత్ రాజు
రిలీజ్ డేట్ : జూలై 28, 2018
విజయవాడ కుర్రాడు ఆనంద్(సుమంత్ అశ్విన్)హైదరాబాద్ అమ్మాయి అక్షర(నీహారిక) ప్రేమించుకుంటారు. ఇరువురి కుటుంబ పెద్దలు వీరికి పెళ్లి ఖాయం చేసి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఇంతలో గతంలో అక్షర ప్రేమికుడు విజయ్(రాజా) తిరిగి వస్తాడు. గతంలో ఇద్దరు కలిసి చేసిన బొటీక్ బిజినెస్ పేరుతో తనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు విజయ్. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యే అక్షర.. పెళ్లి దాకా వచ్చి ప్రేమ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది.
ఈ క్రమంలో ఆనంద్ కి కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. ఆనంద్ మాత్రం అక్షరను విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్షరలో మార్పు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. చివరికి అక్షర పెళ్లి ఆనంద్ తోనే జరిగిందా.. లేదా మాజీ ప్రేమికుడు విజయ్ తో జరిగిందా అనేది బ్యాలెన్స్ స్టోరీ.

==============================================================================

బ్రహ్మోత్సవం

నటీనటులు : మహేష్ బాబుసమంత రుత్ ప్రభుకాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్నరేష్సత్యరాజ్జయసుధరేవతిశుభలేఖ సుధాకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్స్ మిక్కీ జె. మేయర్గోపీ సుందర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి

రిలీజ్ డేట్ :  20 మే 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరోతన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీ నటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్  : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==============================================================================

ఆచారి అమెరికా యాత్ర
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులుతమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

==============================================================================

ఛల్ మోహన్ రంగ

నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్

ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : కృష్ణ చైతన్య

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018

చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారుఅనేది మిగతా కథ.

==============================================================================

బుజ్జిగాడు

నటీనటులు ప్రభాస్త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబుసంజనాకోట శ్రీనివాస రావు, M.S. నారాయణసునీల్బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడుపూరిజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన  సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్  డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.