జీ సినిమాలు ( 19th నవంబర్ )

Sunday,November 18,2018 - 10:39 by Z_CLU

రాజా చెయ్యి వేస్తే
నటీనటులు : నారా రోహిత్, తారక రత్న, ఈశా తల్వార్
ఇతర నటీనటులు : అవసరాల శ్రీనివాస్, శశాంక్, C.V.L. నరసింహా రావు, శివాజీ రాజా, రాజీవ్ కనకాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : ప్రదీప్ చిలుకూరి
ప్రొడ్యూసర్ : సాయి కొర్రపాటి
రిలీజ్ డేట్ : 29 ఏప్రియల్ 2016
నారా రోహిత్, తారక రత్న కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రాజా చెయ్యి వేస్తే. ఒక రోజు రెస్టారెంట్ లో కూర్చుని తన గర్ల్ ఫ్రెండ్ కి తను రాసుకున్న కథ చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ కథ విని  అప్రీషియేట్  చేస్తారు . కానీ ఆ తరవాత హీరోకి ఒక పరిచయం లేని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరు..? తను రాసుకున్న కథకి ఆ వ్యక్తికి ఉన్న సంబంధమేంటి..? అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్.

==============================================================================

అహ నా పెళ్ళంట
నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, రజని
ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్
మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు
డైరెక్టర్ : జంధ్యాల
ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987
అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

==============================================================================

రంగుల రాట్నం
నటీనటులు : రాజ్ తరుణ్, శుక్లా
ఇతర నటీనటులు : సితార, ప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార) తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని అమ్మతో చెప్పి కీర్తికి చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

==============================================================================

దంగల్  ( యుద్ధం )
నటీనటులు : ఆమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సన షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా తదితరులు
డైరెక్టర్ : ప్రీతమ్
డైరెక్టర్ : నితేష్ తివారి
ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2016
తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నా, తన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

==============================================================================

రాక్షసుడు
నటీనటులు : సూర్య, నయనతార
ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్ : 29 మే 2015
సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

==============================================================================

వాసుకి
నటీనటులు : మమ్ముట్టి, నయనతార
ఇతర నటీనటులు : బేబీ అనన్య, షీలు అబ్రహాం, రచన నారాయణ కుట్టి, S.N. స్వామి, రోషన్ మాథ్యూ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ : A.K. సాజన్
ప్రొడ్యూసర్ : జియో అబ్రహాం, P. వేణు గోపాల్
రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి 2016
నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన రివేంజ్ థ్రిల్లర్ వాసుకి. కథాకళి డ్యాన్సర్ అయిన ఒక సాధారణ మహిళ తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా రివేంజ్ తీసుకుంది అనేదే ఈ సినిమాల్ని ప్రధాన కథాంశం. నయనతార నటన ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.