జీ సినిమాలు ( 19th మార్చి )

Sunday,March 18,2018 - 10:40 by Z_CLU

మంచివాడు

నటీనటులు : తనిష్, భామ

ఇతర నటీనటులు: విశ్వనాథ్, వేణు మాధవ్, చంద్రమోహన్ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : సిర్పి

డైరెక్టర్ : లక్ష్మి నారాయణ

ప్రొడ్యూసర్: N.V. ప్రసాద్, ప్రసాద్ జైన్

పల్లెటూరి వాతావరణంలో సాగే అందమైన ప్రేమ కథ మంచివాడు. ఈ సినిమాలో తనిష్, భామ హీరో హీరోయిన్ లుగా నటించగా, విశ్వనాథ్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించారు.

==============================================================================

ప్రేమాభిషేకం

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ

ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981 

టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.

==============================================================================

లక్ష్మీ రావే మా ఇంటికి 

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

==============================================================================

ఏ మాయ చేసావే

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==============================================================================

ఇంద్రుడు 

హీరో హీరోయిన్స్ : విశాల్,లక్ష్మి మీనన్

ఇతర నటీనటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్

నిర్మాత : విశాల్. రోన్ని,సిద్దార్థ్

దర్శకత్వం : తిరు

విశాల్- లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిజార్డర్ తో భాధ పడే ఓ యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్ , లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్.