జీ సినిమాలు ( 19th డిసెంబర్ )

Monday,December 18,2017 - 10:03 by Z_CLU

కోడిపుంజు

నటీనటులు : తనిష్, ఆంచల్, రోజా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్: B.V.V. చౌదరి

ప్రొడ్యూసర్ : S.S. బుజ్జిబాబు

రిలీజ్ డేట్ : 22 జూలై 2011

==============================================================================

వియ్యాల వారి కయ్యాలు

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

 

 బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

=============================================================================

 

బొబ్బిలి రాజా

హీరో  హీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి

ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్, గుమ్మడి

సంగీత దర్శకుడు –  ఇళయరాజా

దర్శకుడు – బి.గోపాల్

విడుదల తేదీ – 1990

ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా.. 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై…  అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

==============================================================================

 

భయ్యా

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

=============================================================================

 

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.