జీ సినిమాలు ( 18th నవంబర్ )

Sunday,November 17,2019 - 10:43 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త

నటీనటులు : సిబిరాజ్అరుంధతి

ఇతర నటీనటులు : ఇదోబాలాజీ వేణుగోపాల్మనోబాలమయిల్ సామిప్రింజ్ నితిక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్

డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్

ప్రొడ్యూసర్ సత్యరాజ్మహేశ్వరి సత్యరాజ్

రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014

సిబిరాజ్అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

==============================================================================

చింతకాయల రవి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, వేణు తొట్టెంపూడి, శయాజీ షిండే, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008
చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్, రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.

=============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నటీనటులు : సిద్ధార్థ, తమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, నాజర్, వేణు మాధవ్, సుధ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శంకర్–ఎహసాన్–లాయ్

డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009

పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీత, అక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడో, అప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతో, ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..? తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

బెండు అప్పారావు R.M.P.

నటీనటులు : అల్లరి నరేష్కామ్న జెఠ్మలానీ

ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్మేఘన రాజ్ఆహుతి ప్రసాద్రఘుబాబు, L.B. శ్రీరామ్ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినాచిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

నాగభరణం

నటీనటులు : విష్ణువర్ధన్దిగంత్రమ్య

ఇతర నటీనటులు : సాయి కుమార్రాజేష్ వివేక్దర్శన్సాదు కోకిలఅమిత్ తివారీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ : కోడి రామకృష్ణ

ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషిసోహెల్ అన్సారిధవళ్ గాద

రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016

సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి  దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ  శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే  ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం  తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస…  నాగ్ చరణ్  (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.


ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసిందిచివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుందిఅనేది ఈ సినిమా స్టోరీ.