జీ సినిమాలు ( 18th మార్చి )

Sunday,March 17,2019 - 10:02 by Z_CLU

త్రిపుర
నటీనటులు : స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర
ఇతర నటీనటులు : రావు రమేష్, సప్తగిరి, శివన్నారాయణ నడిపెద్ది, జయ ప్రకాష్ రెడ్డి, ప్రీతీ నిగమ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్
రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015
స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్ర, త్రిపురలు ప్రేమలో పడతారు, పెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఆ తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

క్షేత్రం
నటీనటులు : జగపతి బాబు, ప్రియమణి
ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : T. వేణు గోపాల్
ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు
రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011
జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

=============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

==============================================================================

ఆచారి అమెరికా యాత్ర
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.