
మిస్టర్ నూకయ్య
నటీనటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్
ఇతర నటీనటులు : రాజా, బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూరి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా
డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి
నిర్మాత : డి.ఎస్.రావు
రిలీజ్ డేట్ : 8 మార్చ్ 2012
మంచు మనోజ్ సరికొత్త ఎనర్జీతో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.
============================================================================

నాయుడు గారి కుటుంబం
నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు
ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : బోయిన సుబ్బారావు
ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు
రిలీజ్ డేట్ : 1996
సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.
============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.
============================================================================

అష్టాచెమ్మా
నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి
మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్
డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.
============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.
============================================================================

భలే దొంగలు
నటీనటులు – తరుణ్, ఇలియానా
ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్
నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్
దర్శకత్వం – విజయ్ భాస్కర్
విడుదల తేదీ – 11 ఏప్రిల్ 2008
తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్.