జీ సినిమాలు ( 18th ఆగష్టు)

Thursday,August 17,2017 - 10:03 by Z_CLU

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి

ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్

డైరెక్టర్ : V.C. వడివుడియన్

ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్

రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ఒంటరి

నటీనటులు : గోపీచంద్, భావన

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వర రావు, అజయ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : B.V.రమణ

ప్రొడ్యూసర్ : పోకూరి బాబు రావు

రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2008

గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంటరి. హ్యాండ్ లూం హౌజ్ ఓనర్ గా కొడుకు వంశీ గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా తన అమ్మా, నాన్నను ఒప్పించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునే లోపు బుజ్జిని ఎవరో కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వంశీ ఏం చేస్తాడు..? తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ఒంటరి. ఈ సినిమాకి B.V.రమణ డైరెక్టర్.

=============================================================================

నవ వసంతం

నటీనటులు : తరుణ్, ప్రియమణి

ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A.రాజ్ కుమార్

డైరెక్టర్ : కె.షాజహాన్

ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి

రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007

తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం’. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో  సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్,  తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

=============================================================================

అనసూయ

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

=============================================================================

యోగి

నటీనటులు ప్రభాస్నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

 

లింగ

నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టిసోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

 

నకిలీ

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

 విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.