జీ సినిమాలు ( 18th ఏప్రిల్ )

Wednesday,April 17,2019 - 10:02 by Z_CLU

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టిచంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్ప్రదీప్ రావత్రవి ప్రకాష్బ్రహ్మానందందివ్యవాణితెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుందినిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

 

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

తడాఖా
నటీనటులు నాగచైతన్యసునీల్తమన్నాఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు ఆశుతోష్ రానానాగేంద్ర బాబుబ్రహ్మానందంవెన్నెల కిషోర్రఘుబాబురమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్  బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్యసునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన  పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడుకథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

అహ నా పెళ్ళంట
నటీనటులు : అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011
రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

జై చిరంజీవ
నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన జై చిరంజీవహిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.