జీ సినిమాలు ( 17th నవంబర్ )

Friday,November 16,2018 - 10:02 by Z_CLU

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

బలుపు

నటీనటులు రవితేజశృతి హాసన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

రెడీ

నటీనటులు : రామ్జెనీలియా

ఇతర నటీనటులు : బ్రహ్మానందంనాజర్చంద్రమోహన్తనికెళ్ళ భరణికోట శ్రీనివాసరావు,జయప్రకాష్ రెడ్డిసుప్రీత్షఫీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 19 జూన్ 2008

రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీశ్రీను వైట్ల డైరెక్షన్ లోతెరకెక్కిన  సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారుకామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

లౌక్యం

నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి  వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

మైసమ్మ IPS

నటీనటులు  : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే

ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు

రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను  పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు.ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది.  మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.