జీ సినిమాలు ( 17th మార్చి )

Friday,March 16,2018 - 10:04 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

 

 ప్రేమించుకుందాం రా

నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

==============================================================================

 

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

సిద్ధు ఫ్రమ్ సికాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహ ఒబెరాయ్

ఇతర నటీనటులు : గుల్షన్,సుమన్, జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు 

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : కరుణాకరన్

నిర్మాత : అశ్విని దత్

విడుదల తేది : 6 జనవరి  2015

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

 

 

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ  సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.